అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajinikanth | కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ రంగాన్ని శాసిస్తున్న తలైవా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.
ఇటీవల విడుదలైన కూలీ సినిమాతో (Coolie Movie) మంచి విజయాన్ని అందుకున్న రజినీ, ప్రస్తుతం జైలర్ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 12న విడుదల కానుంది. ఇక జైలర్ 2 (Jailer 2) తర్వాత రజినీ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (director Nag Ashwin), సుందర్ సి దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయబోతున్నారని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సుందర్ సితో సినిమా ఖాయమని సమాచారం.
Rajinikanth | ఇది నిజం కాకూడదు..
ఇక విశ్వనటుడు కమల్ హాసన్‌తో (Kamal Hassan) రజినీకాంత్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపుదిద్దుకోనుందని, దీనికి లోకేష్ కనగరాజ్ లేదా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా కమల్ హాసన్‌తో చేసే ఈ ప్రాజెక్ట్ రజినీకాంత్ చివరి సినిమా అవుతుందని అంటున్నారు. ఆ సినిమా చేసి తలైవా రిటైర్ అవుతారని వార్తలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. దీంతో తలైవా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ వార్తలు నిజం కాకూడదని, రజినీ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ వార్తలపై రజినీకాంత్ నుండి ఇంకా ఎటువంటి స్పందన లేదు. రిటైర్మెంట్ వార్తల్లో ఎంత వరకు నిజముందో ఆయన క్లారిటీ ఇస్తే గానీ తెలియదు. ఏదేమైనా తలైవా రిటైర్ అవుతారన్న వార్తలు ప్రస్తుతం కోలీవుడ్‌లో (Kollywood) హాట్ టాపిక్‌గా మారాయి.కాగా, రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనకు మనదేశంలోనే కాదు, విదేశాలలోను భారీ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు రజనీకాంత్ రిటైర్ అవుతున్నారని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
