అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం వర్ణించలేనిది. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఆయనకు అపారమైన అభిమానబలం ఉంది. రజినీ సినిమా అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు వేసే రేంజ్ ఆయనది. యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’తో రజనీకాంత్ తెరపై సందడి చేయబోతున్నారు.
ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది. అయితే అదే రోజున ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (NTR and Hrithik Roshan) కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్ ‘వార్ 2’ War 2కూడా విడుదలవుతోంది. రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ పోరు ఉత్కంఠగా మారింది. ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధించబోతోందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగుతోంది.
Coolie Trailer | ట్రైలర్ అదిరింది..
కూలీ చిత్రంపై (Coolie Movie) అంచనాలు పెంచేలా మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల (trailer release) చేశారు. లోకేష్ తనదైన శైలిలో కూలీ చిత్రాన్ని ఆవిష్కరించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. నాగార్జున విలన్‌గా అదరగొట్టాడు. ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది అని చెప్పాలి. దర్శకుడు కనగరాజ్ మొదట్లో ట్రైలర్ విడుదల చేయకుండా.. నేరుగా సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఈ విషయమై కొంతమంది ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. కానీ మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకొని శనివారం ట్రైలర్ విడుదల చేశారు. దీంతో రజినీ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
కూలీ మూవీ లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగంగా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘మోనికా’ సాంగ్ సోషల్ మీడియాలో (Social media) హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటలో పూజా హెగ్డే కన్నా మలయాళ నటుడు సాబిన్ షాహిర్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.44 కోట్ల భారీ మొత్తానికి దగ్గుబాటి సురేష్‌బాబు, సునీల్ నారంగ్ సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సత్యరాజ్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఒక స్పెషల్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.