అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Coolie Ticket Price | సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం(Director Lokesh Kanagaraj)లో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. 2025లో విడుదలయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీల్లో టాప్ ప్లేస్ దక్కించుకున్న ఈ చిత్రం, రజనీకాంత్(Superstar Rajinikanth) కెరీర్‌లో ఒక భారీ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు, విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కులు, ప్రీ-సేల్ టికెట్ల ద్వారా రూ.250 కోట్లు వసూలు అయ్యాయి. థియేట్రికల్ మార్కెట్(Theatrical Market) లో కూడా సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో, దేశవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు రాబడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.
Coolie Ticket Price | మరీ ఈ రేంజ్‌లోనా?
చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున(Hero Nagarjuna) ఓ కీలక పాత్రలో నటించడమే కాకుండా, ఉపేంద్ర పాత్ర, అనిరుధ్ మ్యూజిక్, లోకేష్ డైరెక్షన్ ఇవన్నీ కలిసొచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’పై ప్రత్యేక ఫోకస్ ఉంది. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షో(Benefit Show)లకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ కాగా, కొన్ని నిమిషాల్లోనే వెలాది టికెట్లు సేల్ అయ్యాయి. అయితే ఈ హైప్‌కు అనుగుణంగా టికెట్ ధరలు అమాంతం పెంచేయడంతో ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో ప్రభుత్వం(Tamil Nadu Government) టికెట్ ధరలపై కఠిన నియంత్రణలు పెట్టిన నేపథ్యంలో, అక్కడ పీవీఆర్‌లలో టికెట్ ధర రూ.183గా ఉంది. అదే సమయంలో హైదరాబాద్ పీవీఆర్‌లలో రూ.453 ధర ఉండడం వింతగా ఉందంటూ ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
“తమిళనాడులో పీపుల్స్ ఫస్ట్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మేకర్స్ ఫస్ట్ అన్నట్టుంది. ఇలా ధరలు పెంచేస్తే, ఓటీటీలోకి వచ్చే వరకు ఆగాలనిపించక తప్పదు,” అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న వారి కోసమే ఇంత భారీగా పెంచారా అంటూ కొందరు తిట్టిపోస్తున్నారు. ఈ మాత్రం పెంచితే కాని మూవీ రైట్స్ తీసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్‌లో పడరేమో. అందుకే ఇలా పెంచారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లోనూ బెనిఫిట్ షోలు, ఫస్ట్ డే షోల కోసం టికెట్ ధరలు రూ.300 నుంచి రూ.1000 వరకు పెరిగాయి అని వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం టికెట్ ధరల(Ticket Prices)పై పరిమితి విధించినప్పటికీ, బెంగళూరులో కొన్ని థియేటర్లు తెల్లవారు ఝాము షోలకు అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా రేట్లు పెంచుతూ పోతే ఏదో ఒక రోజు బాయ్‌కాట్ ట్రెండ్ రావడం ఖాయం. తెలుగు ఆడియన్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు.
