HomeతెలంగాణHydraa | రాజేంద్రనగర్​ల్​ హైడ్రా కూల్చివేతలు.. రూ.139 కోట్ల విలువైన భూమి స్వాధీనం

Hydraa | రాజేంద్రనగర్​ల్​ హైడ్రా కూల్చివేతలు.. రూ.139 కోట్ల విలువైన భూమి స్వాధీనం

Hydraa | రాజేంద్ర నగర్​ మండలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. నాలుగు పార్కులను కబ్జా చెరల నుంచి విడిపించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | రంగారెడ్డి జిల్లా (Rangareddy District)రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా అధికారులు బుధవారం తొలగించారు. ఆక్రమణలకు గురైన నాలుగు పార్కులకు విముక్తి కల్పించారు.

నగరంలో ఆక్రమణలపై హైడ్రా (Hydraa)ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తుంది. అంతేగాకుండా ప్రజల ఫిర్యాదుల మేరకు పార్కులను కూడా కబ్జా చెరల నుంచి విడిపిస్తుంది. తాజాగా బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2లలో ఆక్రమణలకు గురైన నాలుగు పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

Hydraa | ఫిర్యాదులు రావడంతో..

దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I &II పేరుతో హుడా అప్రూవల్ తో జనచైతన్య లేఔట్ (Jana Chaitanya Layout) ఏర్పాటు చేశారు. ఇందులో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా అధికారులు (Hydraa Officers)గుర్తించారు. ఈ మేరకు బుధవారం కబ్జాలను తొలగించారు. పార్క్​ స్థలాల్లో ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను, రూమ్​లను హైడ్రా తొలగించింది. అనంతరం అక్కడ ఫెన్సింగ్​ నిర్మాణ పనులు చేపట్టింది.