Homeక్రీడలుBCCI | BCCIలో కీలక మార్పు: రోజర్ బిన్నీ పదవీ పరిమితి పూర్తి .. తాత్కాలిక...

BCCI | BCCIలో కీలక మార్పు: రోజర్ బిన్నీ పదవీ పరిమితి పూర్తి .. తాత్కాలిక అధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఊహించిన‌ మార్పే జరిగింది. మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్‌ విన్నర్ రోజర్ బిన్నీ, ప్రతిష్ఠాత్మక BCCI అధ్యక్ష పదవికి ఉద్యోగ పరిమితి (70 ఏళ్ల వయస్సు) కారణంగా రాజీనామా చేశారు ఈ స్థితిలో ప్రస్తుతం BCCI వైస్‌ ప్రెసిడెంట్గా ఉన్న రాజీవ్ శుక్లా(Rajiv Shukla), బోర్డు తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. గ‌తంలో రాజీవ్ శుక్లానే అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని ప్ర‌చారాలు సాగ‌గా,ఇప్పుడు ఆయ‌న‌ని తాత్కాలిక ప్రెసిడెంట్‌గా నియ‌మించారు. BCCI నియమాల ప్రకారం, “ ఎక్కువ వ‌య‌స్సు ఉన్న అధ్య‌క్షుడు ప‌ద‌వీ నుండి త‌ప్పుకుంటే మ‌రో ఆలోచ‌న లేకుండా వైస్‌‑ప్రెసిడెంట్(Vice President) తాత్కాలిక బాధ్యత తీసుకుంటాడు.

BCCI | శుక్లాకి బాధ్య‌త‌లు..

రోజర్ బిన్నీ(Roger Binney) జూలై 19న 70 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డంతో, బోర్డు ఉద్యోగ పరిమితి ప్రకారం పదవిని వదిలివేసవలసి వచ్చింది. ఈ క్ర‌మంలో రాజీవ్ శుక్లా (65)ఆ బాధ్య‌త తీసుకున్నారు. శుక్లా ఉత్త‌ర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేత, IPL కమిషనర్‌గా కూడా సేవలందించారు. 2020‑లో వైస్‌‑ప్రెసిడెంట్‌గా (BCCI)కి బాధ్యతలు చేపట్టారు. శుక్లా సెప్టెంబ‌ర్‌లో బోర్డ్ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు తాత్కాలిక అధ్య‌క్షుడిగా ఉండ‌నున్నారు. నేషనల్ మీడియా కథనాల ప్ర‌కారం రీసెంట్‌గా బీసీసీఐ అపెక్స్ కౌన్సెల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో జ‌ర‌గ‌గా, ఈ స‌మావేశంలో స్పాన్సర్‌షిప్ అంశం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుత‌స్తుంది. డ్రీమ్ 11తో ఉన్న ఒప్పందం రద్దవడంతో.. రానున్న రెండున్నర సంవత్సరాల పాటు బోర్డుకు కొత్త స్పాన్సర్‌ను ఇప్పుడు వెతికే ప‌నిలో ఉన్నారు

ఇక సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త స్పాన్సర్‌షిప్ పెద్ద సవాలుగా మారింది అనే చెప్పాలి. మరోవైపు మరి కొద్ది రోజుల్లో జరిగే బీసీసీఐ ఎన్నికల్లో(BCCI Elections) అధ్యక్షుడిగా ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారనే విష‌యంపై హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ రేసులోకి దూసుకొచ్చారు.. గతంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేయ‌గా, ఆ త‌ర్వాత కూడా మళ్లీ కూడా గంగూలీనే ఎన్నికవుతారని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. మరి రానున్న రోజుల్లో గంగూలీ మరోసారి అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Must Read
Related News