అక్షరటుడే, వెబ్‌డెస్క్: Janagama | రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును (RTC bus) కంకరలోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొని 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
జనగామ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు (Rajdhani bus) ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను దిండిగల్ చెందిన ఓం ప్రకాశ్, హన్మకొండకు (Hanmakonda) చెందిన నవదీప్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Janagama | బైక్‌ను ఈడ్చుకెళ్లిన ట్రక్కు
బైక్‌ను ట్రక్కు ఢీకొని ఐదు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad distric) చోటు చేసుకుంది. ఆత్రం రాంజీ (40) ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి ట్రక్కు ఢీకొంది. తలమడుగు మండలంలోని మావల బైపాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రాంజీ ఎగిరి రోడ్డు పక్కన పడగా.. కంటెయినర్ ట్రక్కు ముందు భాగంలో బైక్ ఇరుక్కుంది. అయినా డ్రైవర్ ఆపకుండా 5 కిలోమీటర్ల వరకు బైక్‌ను ఇడ్చుకెళ్లాడు. పోలీసులు కంటెయినర్ ట్రక్‌ను వెంబండించి డ్రైవర్‌ని పట్టుకున్నారు. ప్రమాదంలో రాంజీకి స్వల్ప గాయాలు అయ్యాయి.
