- Advertisement -
Homeక్రీడలుIPL 2025 | గుజరాత్‌పై విజయం.. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఏంటంటే..?

IPL 2025 | గుజరాత్‌పై విజయం.. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఏంటంటే..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 |ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ RR ఎట్టకేలకు మూడో విజయాన్ని నమోదు చేసింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన గత మూడు మ్యాచ్‌ల్లో గెలుపు ముంగిట బోర్లా పడిన రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ టైటాన్స్‌ GTతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి తప్పిదం చేయలేదు. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ vaibhav suryavamshi (38 బంతుల్లో (7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో.. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 25 బంతులు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో ఓ అడుగు ముందుకేసిన రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ SRHను వెనక్కి నెట్టి 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. 3 విజయాలు మాత్రమే నమోదు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అద్భుతం జరిగితే తప్పా.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ playoffs చేరుకోలేదు. ఈ టోర్నీలో రాజస్థాన్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగింటికి నాలుగు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితిని తెచ్చుకుంది. ఈ నాలుగు విజయం సాధించినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌ runrateపై ఆధారపడాల్సి ఉంటుంది.

- Advertisement -

రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఆ తర్వాత టాప్-3 టీమ్స్ మినహా మిగతా జట్లు 7 మ్యాచ్‌లకు మించి విజయాలు సాధించకూడదు. రన్ రేట్ కూడా రాజస్థాన్ కంటే తక్కువగా ఉండాలి. అప్పుడు రాజస్థాన్ 14 పాయింట్స్‌, మెరుగైన రన్‌రేట్‌తో నాలుగో టీమ్‌గా.. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. కానీ గత సీజన్‌లో ఆర్‌సీబీ ఇలానే వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News