అక్షరటుడే, వెబ్‌డెస్క్: rajasthan road accident | రాజస్థాన్ Rajasthan రాష్ట్రం బూందీ జిల్లాలోని 52వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తాపడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బూందీ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిలోర్ వంతెన సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టోంక్ జిల్లాకు చెందిన ఐదుగురు ఒక బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు కారులో కోటా వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో జైపూర్ నుంచి కోటాకు వెళ్తున్న కంకర లోడుతో ఉన్న ట్రక్కు వెనుక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.
rajasthan road accident | విషాదం..
ట్రక్కు టైర్ Truck Tyre పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రాంగ్ రూట్లోకి వెళ్లి కారుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు కింద పడిన కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సోదరులతో సహా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రక్కు కింద నలిగిపోయిన కారును బయటకు తీశారు. మృతదేహాలను చాలా గంటల పాటు శ్రమించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు Traffic అంతరాయం ఏర్పడగా, అనంతరం పరిస్థితిని పునరుద్ధరించారు. ట్రక్కు టైర్ పగలడమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.