HomeUncategorizedNEET Student | నీట్ ర్యాంక్ సాధించిన కార్మికుడి కుమారుడు.. గ్రామంలో ఆనందోత్సాహాలు

NEET Student | నీట్ ర్యాంక్ సాధించిన కార్మికుడి కుమారుడు.. గ్రామంలో ఆనందోత్సాహాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Student | శ్రవణ్ కుమార్ అనే 19 ఏళ్ల యువ‌కుడు రాజస్థాన్ రాష్ట్రం బాలోత్రాలోని ఖటూ గ్రామం(Khatu Village)లో నివ‌సిస్తూ ఉన్నాడు. అత‌ను ఎన్నో ఇబ్బందుల‌ను అధిగమించి NEET 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. రెండు గదుల మట్టి ఇంట్లో నివసించే శ్రావణ్, చదువుతో పాటు స్థానిక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా కుటుంబ పోష‌ణ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. గ్రామాల‌లో జరిగే వేడుక‌ల‌లో పాత్రలు కడగడం ద్వారా జీవ‌నోపాధి పొందుతున్నారు. తీవ్రమైన ఆర్థిక సమస్యల మధ్య కూడా శ్రావణ్ OBC కేటగిరీలో 4,071వ ర్యాంక్ సాధించి, రాజస్థాన్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు ద‌క్కించుకోబోతున్నాడు.

NEET Student | టూ గ్రేట్..

తన కుటుంబం ఆర్థికంగా పేదరికంలో ఉండి, తల్లిదండ్రులు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్న‌ పరిస్థితుల్లో శ్రవణ్ తన చదువును కొనసాగిస్తూ, ఫ్యాక్టరీలో పనిచేసి కుటుంబానికి సహాయం చేశాడు. తన విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. స్కూల్‌లో 10వ తరగతిలో 97% మరియు 12వ తరగతిలో 88% మార్కులు సాధించి, తన ప్రతిభను ప్రదర్శించాడు. తనకు విద్యా సాధనలో సహాయం చేయడానికి ప్రభుత్వ వైద్యులు ఉచితంగా NEET కోచింగ్ అందించారు.

తన కుటుంబం తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్నప్పటికీ, శ్రవణ్ (Shravan Kumar) తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో కష్టపడి, తను క‌న్న క‌ల‌ల‌ని నిజం చేసుకున్నాడు. తన విజయంతో, బాలోత్రా గ్రామం(Balotra Village)లో శ్రవణ్ ఇంటి ముందు ఆనందోత్సవాలు అంబ‌రాన్నంటాయి. శ్ర‌వణ్ జీవితం చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తుంది. కష్టాల నుంచి త‌ను అనుకున్న గ‌మ్యానికి చేరుకున్న నేప‌థ్యంలో శ్రవ‌ణ్ యువతకు ఒక ప్రేరణగా నిలుస్తాడు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. తన కృషి, పట్టుదల మరియు కుటుంబ మద్దతుతో, వైద్యవిద్యలో తన ప్రయాణం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్ర‌వ‌ణ్ గురించి తెలుసుకున్న ప్రతిఒక్క‌రూ కూడా అత‌నితో పాటు ఆయ‌న కుటుంబాన్ని కూడా ప్ర‌శంసిస్తున్నారు.