ePaper
More
    HomeసినిమాThe Raja Saab | రిలీజ్​కు ముందే ‘రాజాసాబ్​’ రికార్డులు

    The Raja Saab | రిలీజ్​కు ముందే ‘రాజాసాబ్​’ రికార్డులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : The Raja Saab | ప్రభాస్ (Prabhas)​ హీరోగా తెరకెక్కిన ది రాజాసాబ్ (Raja Saab)​ రిలీజ్​కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. మారుతి (Maruti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్​కు మంచి స్పందన లభించింది.

    బాహుబలి, సలార్​, కల్కి సినిమాలతో ప్రభాస్​ పాన్​ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో ఆయన సినిమాలకు హిందీ (Bollywood)లో కూడా విపరీతంగా క్రేజ్​ ఉంది. ఈ క్రమంలో ది రాజాసాబ్ (The Raja Saab)​ సినిమా రిలీజ్​కు ముందే హిందీ మార్కెట్​లో రికార్డులు సాధిస్తోంది. హిందీలో ఇప్పటి వరకు రూ.75 కోట్ల బిజినెస్​ పూర్తి చేసింది. ఐవీ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థ ది రాజాసాబ్​ హిందీ హక్కులను రూ.75 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మ్యూజిక్​ హక్కులను రూ.25 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో ఓటీటీ, టీవీ హక్కుల రూపంలో మరో రూ.70 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో రాజాసాబ్​ మూవీ రిలీజ్​కు ముందే రూ.150 కోట్లకు మించి వసూలు కలెక్ట్​ చేయనుంది.

    The Raja Saab | రిలీజ్​ ఎప్పుడంటే..

    హరర్​ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్​ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్​ నటించిన కల్కి (Kalki) సినిమా గతేడాది 2024 జూన్​లో విడుదలైంది. ఏడాది నుంచి ప్రభాస్​ సినిమాలు లేకపోవడంతో రాజాసాబ్​ కోసం డార్లింగ్​ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్​ అయ్యే అవకాశం లేదు. డిసెంబర్​లో మూవీని విడుదల చేయడానికి మేకర్స్​ ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభాస్​ కీలక పాత్రలో నటించిన కన్నప్ప (Kannappa Movie) మాత్రం జూన్​ 27(శుక్రవారం) రిలీజ్​ కానుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్​ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో డార్లింగ్​ ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

    More like this

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...