అక్షరటుడే, వెబ్‌డెస్క్ :TDP Leader Resign | ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతోంది. ఏడాది కాలంలోనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి.
సీమ జిల్లాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీకి TDP సీనియర్ నేత గుడ్ బై చెబుతూ పార్టీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖ పంపారు. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆ నేత రాజీనామా ఇప్పుడు సంచలనంగా మారుతోంది. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ నేతలే తానూ ఓడిపోవడానికి కారణమయ్యారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
TDP Leader Resign | పెద్ద షాకే..
బాలసుబ్రమణ్యం (sugavasi subramanyam) సోదరుడు సుగవాసి ప్రసాద్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. “పార్టీ నాయకుల కోసం కాదు, కార్యకర్తల కోసం మేం రాజకీయాల్లో ఉన్నాం. వాళ్లే మాకు ప్రాణం. పార్టీ బలపడాలంటే నిస్వార్థ నాయకత్వం అవసరం” అని వ్యాఖ్యానించారు. పార్టీ వర్గాలలో ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రభావాన్ని చూపించే వీలుంది. బాలసుబ్రమణ్యం వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, ఏ పార్టీ తరపున పోటీ చేస్తారన్నది ఇంకా వెల్లడించలేదు. స్వతంత్ర అభ్యర్థిగా గానీ, కొత్త పార్టీతో గానీ, రాజకీయంగా నూతన దిశలోకి వెళ్ళే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
TDP Leader Resign | బలమైన వారసత్వం
సుగవాసి బాలసుబ్రమణ్యం రాజకీయాల్లోకి రావడం వెనుక బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి, ప్రాంతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచారు. అదే మార్గాన్ని అనుసరిస్తూ బాలసుబ్రమణ్యం రాజకీయాల్లోకి వచ్చారు.
2024లో టీడీపీ పరిస్థితి, నియోజకవర్గ స్థాయి విభేదాలు, లోపలి రాజకీయాల కారణంగా బాలసుబ్రమణ్యం ఓటమిని చవిచూశారు. దీనిపై ఆయన అసంతృప్తిగా ఉండటమే కాదు.. పార్టీపై నేరుగా కామెంట్ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే రాజంపేట Rajampeta నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పార్టీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయారనే టాక్ ఉంది. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యంలు కీలకంగా ఉన్నారు. దీంతో పార్టీ కేడర్ కొంత గందరగోళంలో ఉంది