HomeసినిమాSSMB Event | మహేశ్ బాబు – రాజమౌళి మూవీ ఈవెంట్‌కు ప్రత్యేక ‘పాస్‌పోర్ట్ పాస్‌లు’.....

SSMB Event | మహేశ్ బాబు – రాజమౌళి మూవీ ఈవెంట్‌కు ప్రత్యేక ‘పాస్‌పోర్ట్ పాస్‌లు’.. హైప్ పెంచుతున్న క్రియేటివ్ ప్రమోషన్

గ్లోబ్ ట్రాట‌ర్ ఈవెంట్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేశ్–రాజమౌళి కాంబినేషన్ నుంచి ఎలాంటి సెన్సేషనల్ అప్‌డేట్స్ రానున్నాయా అని అంతా ఆ ఈవెంట్‌పై ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SSMB Event | సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. మహేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి సంబంధించిన తొలి కీలక అప్‌డేట్స్‌ను రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. అయితే ఈవెంట్‌కు ముందే, ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పాస్‌పోర్ట్ స్టైల్ పాస్‌లు’ సోషల్ మీడియాలో (Social Media) భారీగా వైరల్ అవుతున్నాయి.

SSMB Event | పాస్‌పోర్ట్ డిజైన్‌తో..

ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం చిత్రబృందం పసుపు రంగు అట్టతో, అసలు పాస్‌పోర్ట్‌లా కనిపించే విధంగా ప్రత్యేక పాస్‌లను అందించింది. వీటిపై “GLOBETROTTER EVENT”, “PASSPORT” అనే పదాలతో పాటు, మహేశ్ (Mahesh Babu) ప్రీలుక్‌లో కనిపించిన త్రిశూలం లోగోను కూడా ప్రతిబింబించారు. పాస్ లోపల.. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫొటోలు, ఈవెంట్ గైడ్‌లైన్స్, మ్యాప్ తదితర వివరాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక పాస్‌లు చూసిన అభిమానులు క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. సినిమా వర్కింగ్ టైటిల్ ‘గ్లోబ్‌ట్రాటర్’ కావడంతో పాస్‌పోర్ట్ థీమ్‌ను ఎంచుకోవడం పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీగా పలువురు విశ్లేషిస్తున్నారు.

ఈ పాస్‌లపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తెరదించేందుకు రాజమౌళి (Rajamouli) స్వయంగా వీడియో విడుదల చేశారు. ‘పాస్ ఉన్న వారినే మాత్రమే ఈవెంట్‌కు అనుమతిస్తాం. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు’ అని ఆయన స్పష్టం చేశారు. అభిమానులు క్రమశిక్షణ పాటించి ఈవెంట్‌ను విజయవంతం చేయాలని కూడా కోరారు. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ గా కనిపించనున్నారు. సినిమా గ్లోబల్ స్కేల్లో రూపొందుతున్నందున నటీనటుల ఎంపిక కూడా అంతర్జాతీయ స్థాయిలోనే జరుగుతోంది. ఇటీవల విడుదలైన తొలి పాట ‘సంచారీ’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. శృతి హాసన్ ఆలపించిన ఈ గీతం యూట్యూబ్, రీల్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌లో సాగుతోంది.

Must Read
Related News