అక్షరటుడే, వెబ్‌డెస్క్: Director Rajamouli | దర్శకధీరుడు రాజమౌళికి సినిమా అంటే ప్రాణం. ఆయన ప్రతి క్షణం కూడా సినిమా గురించే ఆలోచిస్తారని మనం అనుకుంటాం. కాకపోతే ఆయన క్రికెట్‌ని (Cricket) కూడా బాగానే ఇష్టపడుతుంటారు. పలు సందర్భాలలో ఆయన క్రికెట్‌తో పాటు ఇతర గేమ్‌లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేయగా, అవి నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఐపీఎల్ ఫైనల్ (IPL Final) గురించి రాజమౌళి చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను(Mumbai Indians) పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు చిత్తు చేసింది. ఈ క్రమంలో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్‌లో ఆడనుంది.
Director Rajamouli | ఇంట్రెస్టింగ్ పోస్ట్..
పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అద్భుతమైన విజయం సాధించడంపై రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను (Captain Shreya Iyer) కొనియాడారు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇతను ఢిల్లీని (Delhi) ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు.. ఆ తర్వాత ఢిల్లీ వదిలేసుకుంది. కోల్‌కతాకు సారథ్యం (captained Kolkata) వహించి ట్రోఫీ కూడా అందించాడు. కేకేఆర్ కూడా వదిలేసింది. పదకొండేళ్ల తర్వాత పంజాబ్‌ను యువ ఆటగాళ్లతో ఫైనల్‌లో కూర్చోబెట్టాడు. ఈ ఏడాది కూడా ట్రోఫీ అందుకోవడానికి ఇతడే అర్హుడు” అంటూ రాజమౌళి పోస్ట్ (Rajamouli post) చేశాడు.
దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ (Shreya Iyer) టైటిల్ కొట్టేందుకు పూర్తి అర్హుడని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Director SS Rajamouli) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆర్సీబీ తరఫున వేల పరుగులు సాధించాడని.. ఐపీఎల్ టైటిల్ (IPL title) గెలిచేందుకు సమయం ఆసన్నమైందని రాజమౌళి అన్నారు. ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ ఏదైనా హార్ట్ బ్రేకింగ్ (heartbreaking) మాత్రం తప్పదని దర్శకధీరుడు రాజమౌళి అంటున్నారు. టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలో, టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత కూడా టీమిండియాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు (social media Post) చేశాడు రాజమౌళి.