అక్షరటుడే, వెబ్‌డెస్క్: S.S. Rajamouli | దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) గత రాత్రి నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో (Globe Trotter event) హీరో మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోలీసులకు, అలాగే మహేష్–రాజమౌళిని కలిపిన కేఎల్ నారాయణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను సాధారణంగా ప్రతి సినిమా ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ చెబుతాను. కానీ ఈ సినిమా విషయంలో మాటలు సరిపోవు, కథను చెప్పడం కుదరదు. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయాలని మాత్రమే వీడియో రిలీజ్ చేశాం.
S.S. Rajamouli | మహేశ్‌పై ప్రశంసలు..
మార్చ్ నుంచే ప్లాన్ చేస్తున్నాం, జూన్–జులైకి అన్ని పూర్తి చేశాం, ఇప్పుడు నవంబర్‌లో మీ ముందుకొస్తున్నాం’ అంటూ రాజమౌళి చెప్పారు. చిన్నప్పుడు మహేశ్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ (Super star Krishna) గారి గొప్పతనం తనకు అర్థం కాలేదని, ఇండస్ట్రీలోకి వచ్చాకే ఆయన చేసిన ప్రయోగాలు ఎంత విలువైనవో తెలిసిందన్నారు.
అల్లూరి, ఈస్ట్ మెన్ కలర్, 70ఎంఎం వంటి ఎన్నో కొత్త టెక్నాలజీలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మహా నటుడి కుమారుడితో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను ఐమాక్స్‌లో షూట్ చేసినా అవి 1:1.9 ఫార్మాట్‌లోనే ఉన్నాయి. కానీ ఈసారి మహేష్‌తో చేస్తున్న సినిమా నిజమైన ఫుల్ స్క్రీన్ ఐమాక్స్ అనుభూతిని ఇవ్వబోతుంది. ఇది ప్రీమియమ్ లార్జ్ స్కేల్ సినిమా’ అని వెల్లడించారు.
అనంతరం మహేష్ బాబు (Mahesh babu) వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తారు రాజమౌళి.. ‘సినిమా లేదా నటన గురించి కాదు, మహేష్ రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఆయనలో అందరూ నేర్చుకోవాలనుకునే గొప్ప గుణం ఉంది. మనందరికీ సెల్‌ఫోన్ అడిక్షన్ ఉంటుంది. కానీ మహేష్ మాత్రం ఆఫీస్‌కు వచ్చినా, సెట్స్‌కి వచ్చినా ఫోన్ ముట్టుకోడు. తిరిగి వెళ్లేటప్పుడే ఫోన్ టచ్ చేస్తాడు. నేనూ ఆయనలా ఉండేందుకు ట్రై చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో కలిసి పనిచేస్తున్నందుకు తనకూ ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతోందని రాజమౌళి వ్యాఖ్యానించారు.
