HomeతెలంగాణMinister Post | మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Post | మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Post | రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఆరు పదవుల్లో నాలుగింటిని తాజాగా భర్తీ చేయాలని కాంగ్రెస్(congress)​ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. వీరు ఇద్దరు నల్గొండ పార్లమెంట్​ నియోజకర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు. రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలోని మునుగోడుకు కూడా ఒకసారి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ ​(nizamabad), ఉమ్మడి ఆదిలాబాద్ ​(Adilabad) జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్​ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఓసీల్లో ఒకరికి మాత్రమే పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. తానూ సీనియర్​ నాయకుడినే అని, సమర్థత ఆధారంగా మంత్రి పదవి తనకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానంపై నమ్మకం ఉందన్నారు. బీజేపీలో నుంచి కాంగ్రెస్​లో చేరే సమయంలో, పార్లమెంట్​ ఎన్నికల సమయంలో తన మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్​ పెద్దలు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

Must Read
Related News