అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy మరోసారి టార్గెట్ చేశారు. మునుగోడు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
పదవుల్లో మీరే ఉంటారు, నిధులూ మీరే తీసుకుంటున్నారు.. అంటూ మంత్రులపై విరుచుకుపడ్డారు. తానే మంత్రులను అడిగినా నిధులు రావడం లేదంటూ వాపోయారు.
తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని, మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారు.
Rajagopal Reddy | భాష మార్చుకోవాలంటూ..
కాంగ్రెస్ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) కొంతకాలంగా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన భాష మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 6న మీడియా చిట్‌చాట్‌లో పై వ్యాఖ్యలు చేశారు.
Rajagopal Reddy | తెలంగాణను దోచుకుంటున్నారు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని హితవు పలికారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు (Seemandhra contractors) తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన 20 మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
మూడున్నరేళ్లే రేవంత్ సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా మూడున్నర ఏళ్లే పదవిలో కొనసాగుతారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎవరనేది తర్వాత తెలుస్తుందన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాగా మరో పదేళ్లు తానే సీఎం అని ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం రాజగోపాల్‌రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే.
అధిష్టానం హామీ ఇచ్చింది
తనకు మంత్రి పదవి విషయంలో అధిష్టానం (high command) హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. అయితే ఆ విషయం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komatireddy Venkat Reddy) తెలియదన్నారు. తనకు పదవుల కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారని వ్యాఖ్యానించారు.
చర్యలు ఉంటాయా…
రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గడ్డం వివేక్‌లకు మంత్రి పదవులు ఇచ్చింది.
అప్పటి నుంచి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల (BC reservation) ధర్నాకు సైతం ఆయన వెళ్లలేదు. ఈ క్రమంలో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా.. లేక బుజ్జగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.