HomeతెలంగాణRaja Singh resign | రాజాసింగ్​ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా

Raja Singh resign | రాజాసింగ్​ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Raja Singh resign | బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పార్టీలో ముసలం పుట్టించింది. అధ్యక్ష పదవిని ఎన్​.రాంచందర్​రావుకు (N.Ranchandra Rao) కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు తలో విధంగా స్పందిస్తున్నారు. పార్టీకి రాజీనామా (resign) చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి (Kishan Reddy)కి రాజీనామా లేఖ సమర్పించారు.

Raja Singh resign | నాకు అన్యాయం జరిగింది

బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. పార్టీ కోసం నా సర్వస్వం త్యాగం చేశానని పేర్కొన్నారు. టెర్రరిస్టులకు సైతం తాను టార్గెట్​ అయ్యానన్నారు. నేనే కాదు నా ఫ్యామిలీ కూడా టార్గెట్​ అయ్యిందన్నారు. ఇంత చేసినా తనకు అన్యాయమే జరిగిందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నిర్ణయం ముందే తీసుకున్నారని.. కేవలం నామ మాత్రంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాంచందర్​రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై తాను అసంతృప్తి చెందానన్నారు. కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

Raja Singh resign | నామినేషన్​ వేయనివ్వలేదు

నేను బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్​ వేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. నన్ను పది మంది బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉండగా.. నేను వారిని తీసుకుని వచ్చానన్నారు. కానీ నాయకులను బెదిరించారని చెప్పారు.

Raja Singh resign | ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’

‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అంటూ వ్యాఖ్యానించారు. కిషన్​రెడ్డికి రాజీనామా లేఖ అందజేశానని చెప్పారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరానని చెప్పారు. తాను ఇక బీజేపీ సభ్యుడిని కాదని అసెంబ్లీ స్పీకర్​కు తెలపాలని కిషన్​ రెడ్డికి తెలిపానని చెప్పారు. బీజేపీతో తనకు సంబంధం లేదన్నారు. పార్టీకి రాజీనామా చేసినా కూడా హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

Must Read
Related News