HomeతెలంగాణMLA Raja Singh | ఆయ‌న‌కు చెవులున్నా విన‌బ‌డదు.. కిష‌న్‌రెడ్డిపై రాజాసింగ్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు

MLA Raja Singh | ఆయ‌న‌కు చెవులున్నా విన‌బ‌డదు.. కిష‌న్‌రెడ్డిపై రాజాసింగ్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Raja Singh | బీజేపీలో నెల‌కొన్న విభేదాలు మ‌ళ్లీ ర‌చ్చ‌కెక్కాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి (Kishan Reddy), గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) మ‌ధ్య నెల‌కొన్న వైరం మ‌రోసారి బ‌య‌ట ప‌డింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహకరిస్తే తెలంగాణ (Telangana) మరింత అభివృద్ధి చెందుతుంద‌ని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి త‌న వంతు స‌హ‌కారం అందించాల‌ని కిష‌న్‌రెడ్డిని కోరారు.

MLA Raja Singh | అడిగినా సాయం చేయ‌రు..

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పరోక్షంగా కిష‌న్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) సహాయం అడుగుతున్నా.. వారికి చెవులు ఉన్నా.. వినపడవని అన్నారు. నోరు ఉందని కానీ చెప్పరంటూ రాజాసింగ్ ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని ప్ర‌శ్నించారు.

MLA Raja Singh | ముదిరిన వివాదం..

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి (Kishan reddy), పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MKLLA Raja singh) మధ్య కొన్నాళ్లుగా వైరం న‌డుస్తోంది. రాజాసింగ్ వివాదాస్ప‌ద వైఖ‌రి పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతుండ‌డంతో కిష‌న్‌రెడ్డి ఓర్వ‌లేక పోతున్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ క‌విత (MLC Kavitha) వివాదంపై స్పందించిన రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ (BRS) నుంచి మంచి ప్యాకేజీ అందితే మావాళ్లు ఎప్పుడో ఆ పార్టీలో చేరిపోయే వార‌ని వ్యాఖ్యానించారు. అలాగే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతే ఆ పార్టీ చెప్పిన వారికే ఎన్నిక‌ల్లో టికెట్లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు బీజేపీతో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లో దుమారం రేపాయి. ఆ త‌ర్వాత బండి సంజ‌య్‌ను ఉద్దేశించి కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అంత‌కు ముందు కూడా ఇలాగే ప‌లుమార్లు రాజాసింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే కిష‌న్‌రెడ్డికి, ఎమ్మెల్యేకు మ‌ధ్య దూరం పెరిగిపోయింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election) సమయంలో సైతం అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే.. రాజాసింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సముదాయించిన విషయం విదితమే. అయిన‌ప్ప‌టికీ కిషన్‌రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని రాజా సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Must Read
Related News