Raja Singh | హైదరాబాద్​లో భారీ సంఖ్యలో రోహింగ్యాలు.. రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు
Raja Singh | హైదరాబాద్​లో భారీ సంఖ్యలో రోహింగ్యాలు.. రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | హైదరాబాద్ సిటీ(Hyderabad)లోని పాతబస్తీ(old city Hyderabad)లో భారీ సంఖ్యలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉన్నారని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్​ సింధూర్(Operation Sindoor)​పై ఆయన స్పందించారు. పహల్​గామ్​ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల అడ్డాలకు వెళ్లి మరీ మన సైన్యం దాడులు చేసిందన్నారు. ప్రతి రాష్ట్రంలో పాకిస్తాన్​, బంగ్లాదేశ్​, రోహింగ్యాలను వారి దేశాలకు పంపుతున్నారని రాజాసింగ్​ పేర్కొన్నారు.

పాతబస్తీలో మాత్రం 15 వేల నుంచి 20 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని ఆయన ఆరోపించారు. వారికి ఎంఐఎం MIM party పార్టీ రక్షణ కల్పిస్తోందన్నారు. ఇప్పటికే వారు ఆధార్​ కార్డులు, ఓటర్​ కార్డులు పొందారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని గుర్తించి వెంటనే తిరిగి ఆయా దేశాలకు పంపాలని ఆయన సీఎం రేవంత్​రెడ్డిని (CM Revanth Reddy) కోరారు. అప్పుడే తెలంగాణ భద్రంగా ఉంటుందని అన్నారు.