అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raja Saab trailer | పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Hero Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ట్రైలర్‌కి (The Raja saab Trailer) సంబందించిన అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఆదివారం మేకర్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 29 సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రం కోసం గడచిన కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కి (Prabhas Fans) ఇది పండుగే అని చెప్పవచ్చు. ‘బాహుబలి’, ‘సాహో’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ (Salaar) వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ తొలిసారిగా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్-హారర్ ఎంటర్‌టైనర్ లో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్, యాక్షన్ పంచులు, ఫన్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Raja Saab trailer | ట్రైలర్ వచ్చేస్తోంది..
టీజర్‌లో teaser బీజీఎం, విజువల్స్, హారర్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. దర్శకుడు మారుతి స్టైల్కి తగ్గట్టే ఇందులో కామెడీ, హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీఠ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిధి కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలి సినిమాల్లో ప్రభాస్‌కు పరిమిత స్కోప్ ఉన్న రొమాన్స్ సీన్ల కారణంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న దర్శకుడు మారుతి, ఈ సినిమాలో ఎమోషనల్, ఎంటర్‌టైనింగ్ రొమాన్స్ చూపించబోతున్నట్టు తెలిపారు.
ఇది మొదట డిసెంబర్ 5, 2025 న విడుదల కావాల్సి ఉన్నా, షూటింగ్ ఆలస్యం, VFX పనుల డిలే కారణంగా రిలీజ్ వాయిదా పడింది. చివరికి మేకర్స్ ఈ సినిమాను జనవరి 9, 2026 న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్‌లలో రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, ట్రెండ్స్ కనిపించనున్నాయని చెబుతున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు చేయనున్నాడు. రానున్న రోజులలో ఈ చిత్రాలతో ప్రభాస్ సందడి మాములుగా ఉండదు.