అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prabas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ది రాజా సాబ్(The Raja Saab) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అప్డేట్ గురించి ఎన్నో రోజుల నుంచి తెగ ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా టీజర్ అప్డేట్ విడుదల కాగా.. ప్రస్తుతం ఈ అప్డేట్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ అప్డేట్లో ప్రభాస్ మాస్ అవతారంలో కనిపించారు. నల్ల బనీన్ ఏసుకొని.. ఎర్ర క్లాత్ పట్టుకొని.. మంటల మధ్య నిలబడుకొని ఉండగా.. ఈ సినిమా టీజర్ జూన్ 16న 10:52కు విడుదలవుతుందని.. అలానే సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది అంటూ అప్డేట్ ఇచ్చేశారు.
Prabas | ఫ్యాన్స్‌కు పూనకాలే..
ప్రస్తుతం ప్రభాస్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నా కానీ.. ఆయన కల్ట్ అభిమానులు మాత్రం మారుతీ దర్శకత్వం(Director Maruthi)లో రానున్న.. రాజా సాబ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇందుకు ముఖ్య కారణం మళ్లీ డార్లింగ్ టైంలో ప్రభాస్ లుక్స్.. ఈ సినిమా పోస్టర్స్‌లో కనిపించడం. మారుతి (maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) నాయికలు. ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వళ్ల షూటింగ్ ఆలస్యం అవుతూ ఇంకా చివరి దశ షూటింగ్‌లోనే ఉండి పోయింది.
అయితే అభిమానులు, సినీ లవర్స్ సినిమాకు సంబంధించి అప్‌డేట్ అంటూ పదేపదే ఒత్తిడి తేవడంతో మేకర్స్ ఎట్టకేలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు. వాస్తవానికి ముందు డిసెంబర్ 12 అనే ప్రచారం జోరుగా జరిగింది. యూనిట్ వర్గాలు ఈ దిశగానే లీక్స్ ఇచ్చాయి. కానీ గంటల వ్యవధిలో నెంబర్ మారిపోయి ఇప్పుడు సరిగ్గా పుష్ప–2 ది రూల్ తేదీని తీసుకుని తెలివైన ఎత్తుగడ వేశారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సంక్రాంతి దాకా ఎంతలేదన్నా నెల రోజుల బలమైన రన్ దక్కుతుంది. వెయ్యి కోట్లను రెండు వారాల్లోపే దాటించవచ్చని అల్లు అర్జున్ ఆల్రెడీ నిరూపించాడు. ఇప్పుడు ప్రభాస్(Prabhas) కూడా అదే స్ట్రాటజీతో వస్తున్నట్టు తెలుస్తుంది.