HomeUncategorizedRaja Saab | రాజా సాబ్ టీజ‌ర్ లీక్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు.. అస‌లు ఏం...

Raja Saab | రాజా సాబ్ టీజ‌ర్ లీక్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగిందంటే.!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Saab | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయ‌న న‌టించిన తాజా చిత్రం రాజా సాబ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan) తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్(Sanjay Dutt), మురళి శర్మ, అనుపమ్ ఖేర్(Anupam Kher) లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Raja Saab | కేసు న‌మోదు..

టీజర్​లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్, హీరోయిన్ల గ్లామర్ యాడ్ అందరిని ఎంత‌గానో ఆక‌ర్షించాయి. ప్రస్తుతం ఈ టీజర్ మిలియన్ల వ్యూస్​తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఫ్యాన్స్ ప్రభాస్​ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి(Maruthi) ప్రభాస్ ను అలా చూపించాడని ప్రశంసలు వచ్చాయి. ది రాజా సాబ్​లో హారర్ కంటెంట్​తో పాటు మారుతి మార్క్ కామెడీ, అలాగే హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని టీజర్ చూస్ ఇట్టే అర్ధమవుతుంది. అయితే ఈ టీజర్ (Teaser) రిలీజ్​కు ముందే ది రాజాసాబ్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా టీజర్​ను రిలీజ్​కు మూడు రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అప్రమత్తమైన ది రాజా సాబ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది.

ప్రభాస్(Hero Prabhas) సినిమా టీజర్ లీక్‌పై బంజారాహిల్స్ పీఎస్‌(Banjara Hills PS)లో ఫిర్యాదు చేసింది చిత్ర బృందం. ఈనెల 16న ది రాజా సాబ్ టీజర్ రిలీజైంది. అయితే మూడు రోజుల ముందే టీజర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీనికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సినిమా డబ్బింగ్‌ ఇన్‌ఛార్జ్ వసంత్‌కుమార్ పోలీసులను కోరారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత సినిమా స్టోరీకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమా అయితే ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నుంద‌ని అంటున్నారు.