HomeUncategorizedRaja Saab | రాజా సాబ్ స్టోరీ ఇదా.. ఎప్పుడూ చూడ‌ని వినూత్న క‌థ‌తో సినిమా...

Raja Saab | రాజా సాబ్ స్టోరీ ఇదా.. ఎప్పుడూ చూడ‌ని వినూత్న క‌థ‌తో సినిమా రానుందా..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Saab | వ‌రుస హిట్స్‌తో జోష్ మీదున్న ప్ర‌భాస్ (Prabhas) తాజాగా న‌టించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ను వింటేజ్ లుక్​తో పాటు డార్లింగ్​తో కామెడీ పండించే ప్రయత్నంలో ‘ది రాజా సాబ్'(The Raja Saab) చిత్రం అంచనాలను మించిపోతోంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నారు. ప్రభాస్ లుక్స్, విజువల్స్, మ్యూజిక్, బీజీఎం పరంగా ఎక్కడా లోటు లేకుండా గ్రాండియ‌ర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రభాస్ కామెడీ టైమింగ్, రొమాంటిక్ యాంగిల్ చూసి చాలాకాలం అయింది. ఇది రాజా సాబ్‌తో తీర‌నుంది. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల కాగా.. ఇది చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఈ క్రేజ్‌తోనే ఈ టీజర్ 24 గంటల్లోనే ఏకంగా 59 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Raja Saab | క‌థ ఇదేనా..!

ఈ మూవీలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్లు పోస్టర్లు, గ్లింప్స్ చూస్తుంటేనే అర్థం కాగా టీజర్ ద్వారా ఆ విషయం కన్​ఫం అయింది. మరోవైపు చాలాకాలం తర్వాత ప్రభాస్ హీరోయిన్లతో రొమాన్స్ సీన్స్ చేస్తుండడం సినిమాపై అంచనాలు పెంచేసింది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో సిద్ధమవుతున్న రాజా సాబ్​ను భారీ బడ్జెట్​తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్(Media Factory Banner)పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్​గా నిర్మిస్తున్నారు. అయితే సినిమాను షూటింగ్ కొంత అయ్యేవరకు అఫీషియల్​గా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్​ను విడుదల చేయడంతో ఓ రేంజ్​లో అంచనాలు నెలకొన్నాయి. ది రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ సినిమా స్టోరీపై సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది.

మనవడు, అతని తాత, నాయనమ్మ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్ర కథ ఆవిష్కరిస్తుందని టాక్ న‌డుస్తుంది. ఎంతో భావోద్వేగంగా ఉండేలా క‌థ‌ని రూపుదిద్దిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇది ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. టీజర్​లో యంగ్ ప్రభాస్ రోల్​ను చూపించిన మేకర్స్.. తాత పాత్రను చూపించలేదు. ఆయనే రాజా సాబ్ అంట. ఎక్కడో సుదూర అడవి ప్రాంతంలో ఉన్న కోట.. దెయ్యం బంగ్లాలా అనిపించినా లోపల మాత్రం రాజభవనంలా ఉంటుంది. చావు తర్వాత కూడా తానే అనుభవించాలనే ఒక రాజు సంజయ్ దత్ (Sanjay Dutt).. వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్లాష్‌బ్యాక్‌లో ప్రభాస్ తాత అయిన రాజాసాబ్‌ని సంజయ్ దత్ నమ్మించి చంపేసి ఆ ఆస్తినంతా తానే అనుభవించాలన్న కోరికతో క్షుద్రపూజలు చేయించి చచ్చిపోతాడు. పగ, ప్రతీకారంతో రాజాసాబ్ ఆ కోటలనే దెయ్యమై తిరుగుతుంటాడు. స్టోరీ మొత్తం హీరోకి తెలిసిపోవ‌డంతో క్లైమాక్స్‌ ఫైట్‌లో సంజయ్ దత్‌ దెబ్బకి ప్రభాస్ పడిపోతే రాజా సాబ్ తాత అతడి శరీరంలోకి ప్రవేశించి విలన్‌ని అంతమొందిస్తాడు అని కొంద‌రు చెబుతున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.