అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yellareddy CI | ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్గా దొరగారి రాజారెడ్డి (Yellareddy Ci Rajareddy) బాధ్యతలు స్వీకరించారు.
మెదక్ సీసీఎస్ నుంచి ఆయన్ను తాజాగా ఎల్లారెడ్డి సీఐగా (Medak CCS to Yellareddy CI) బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేసిన రవీంద్ర నాయక్‌ను ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Yellareddy CI | నిజామాబాద్‌లో సుదీర్ఘం కాలం
ఇన్స్పెక్టర్ రాజారెడ్డి మొన్నటి వరకు మెదక్ జిల్లా సీసీఎస్‌లో పనిచేశారు. అంతకు ముందు ఆయన నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు ఎస్సైగా విధులు నిర్వహించారు. మాక్లూర్, నవీపేట పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై భైంసా సీఐగా వెళ్లారు. తదనంతరం మెదక్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆయన డిచ్పల్లి సీఐగా వస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఎల్లారెడ్డి సీఐగా నియమితులయ్యారు.
