అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rainy Season | కాలాలు మారుతున్న తరుణంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ తరుణంలో వ్యాధులు వ్యాపించడం సహజం. వేసవి వేడి నుండి వర్షాకాలం(Rainy Season) చాలా ఉపశమనాన్ని తెస్తుంది. అయితే, ఇది అంటువ్యాధులు వృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. అధిక తేమ, నిలిచిపోయిన నీరు, ఉష్ణోగ్రతల్లో మార్పులు సీజనల్ వ్యాధులకు(Seasonal Diseases) కారణమవుతాయి. తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. వ్యాధులు మరింత సులభంగా వ్యాప్తి చెందడానికి వీలు కల్పిస్తాయి.
Rainy Season | సీజనల్ వ్యాధుల ముప్పు..
వర్షాకాలంలోనే అత్యధికంగా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. డెంగీ, మలేరియా వంటి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి టైఫాయిడ్, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ల వరకు అనేక వ్యాధులు వర్షాకాలంలో వెంటాడుతాయి. అయితే, ఇవి దరిచేరకుండా సరైన జాగ్రత్తలతో వాటిని నివారించవచ్చు. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు సులువుగా చెక్ పెట్టొచ్చు. నిల్వ ఉన్న నీటిలో దోమల పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల డెంగీ, మలేరియా(Malaria), చికున్‌గున్యా(Chikungunya) వంటివి వర్షాకాలంలో బాగా పెరుగుతాయి. అలాగే, కలుషిత నీటిని సేవించడం ద్వారా టైఫాయిడ్, కలరా, విరేచనాలు, ఇతర జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు, తేమశాతం పెరుగుదల వల్ల జలుబు, ఫ్లూ, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇక, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు (Fungal Infections) కూడా తేమ కారణమవుతుంది. ఫలితంగా రింగ్‌వార్మ్, అథ్లెట్స్ ఫుట్, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
Rainy Season | ఈ జాగ్రత్తలు పాటించండి..
చిన్న జాగ్రత్తలతో సీజనల్ వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చు. దోమల (Mosquitoes) బారి నుంచి రక్షించుకోవడానికి దోమ తెరను వినియోగించాలి. లేత రంగు ఉన్న ఫుల్ హ్యాండ్ దుస్తులు ధరించాలి. మొక్కల కుండీలు, బకెట్లు, డ్రెయిన్లలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
- సురక్షితమైన తాగునీటిని (Safe Drinking Water) మాత్రమే తాగాలి. కాచి వడపోసిన నీటిని, ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలి.
- ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతను పాటించండి. అలాగే, తరచూ చేతులను సబ్బు, నీటితో కడుక్కోవాలి.
వర్షాకాలంలో బయటి ఆహారం తినకపోవడమే మంచిది. తాజాగా తయారుచేసిన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోండి. - తేలికైన దుస్తులు మాత్రమే ధరించండి. ముఖ్యంగా తేమతో కూడిన పరిస్థితులలో చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచండి.
- రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోండి. కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని అనుసరించండి.
- తేలికపాటి వ్యాయామం లేదా యోగాతో శారీరకంగా చురుకుగా ఉండండి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వండి.
