Homeజిల్లాలుకామారెడ్డిDengue | వ‌ర్షాకాలం.. డెంగీ సోకే స‌మయం.. స్వీయ జాగ్ర‌త్త‌ల‌తోనే ఆరోగ్య‌సంర‌క్ష‌ణ‌

Dengue | వ‌ర్షాకాలం.. డెంగీ సోకే స‌మయం.. స్వీయ జాగ్ర‌త్త‌ల‌తోనే ఆరోగ్య‌సంర‌క్ష‌ణ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dengue | వానాకాలంలో (rainy season) డెంగీ సోక‌డం స‌హ‌జ‌మే. అయితే, దీన్ని తొలి ద‌శ‌లోనే నియంత్రిస్తేనే ఫ‌లితం ఉంటుంది. లేక‌పోతే ప్రాణాల‌కే ప్ర‌మాదం. ఇటీవ‌ల కురిస‌న వ‌ర్షాల‌కు అక్క‌డ‌క్క‌డ నీళ్లు నిలిచి దోమ‌లు వృద్ధి చెందాయి. దీంతో ఉమ్మ‌డి జిల్లాలో రెండ్రోజుల క్రితం డెంగీ కేసు (dengue case) న‌మోదైంది. మ‌న ద‌గ్గ‌రే కాదు దేశ‌వ్యాప్తంగా డెంగీ డేంజ‌ర్ బెల్ మోగిస్తోంది. కోల్‌కతాలోని డమ్ డమ్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక శనివారం డెంగీతో మరణించింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ప్రకారం గ‌త 24 గంటల్లో దేశవ్యాప్తంగా 151 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. 2025 ప్రారంభం నుంచి డెంగీ కేసుల సంఖ్య 7,077కి చేరుకుంది. వానాకాలం (monsoon) మ‌రింత విస్త‌రించే ప్ర‌మాద‌మున్న నేప‌థ్యంలో జాగ్రత్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అధిక జ్వ‌రం, త‌ల‌నొప్పి, బాడీ పెయిన్స్‌, వికారం, ద‌ద్ద‌ర్లు రావ‌డం వంటివి డెంగీ ల‌క్ష‌ణాలు (Dengue Symptoms). కానీ డెంగీ బారిన పడిన చాలా మందిలో ఎలంటి లక్షణాలు క‌నిపించ‌వు. అయితే, డెంగీ నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డానికి కొన్ని మార్గాలున్నాయి. అవెంటో తెలుసుకోండి.

  • డెంగీ ప్ర‌ధానంగా పగటిపూట కుట్టే ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో దోమ‌లు లేకుండా జాగ్ర‌త్త ప‌డాలి. నీరు నిల్వ ఉండ‌కుండా చూసుకోవాలి.
  • శ‌రీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి. పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు వేసుకోవాలి. ముఖ్యంగా బయట ఉన్నప్పుడు లేత రంగు దుస్తులు మంచివి. ఎందుకంటే అవి తక్కువ దోమలను ఆకర్షిస్తాయి.
  • దోమతెరలు ఉపయోగించాలి. దోమలు మీ ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి దోమతెరలను వాడాలి. ఇంటి కిటికీలు, తలుపులపై మెష్ తెరలను ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇంటి ప‌రిస‌రాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలి. ఈడిస్ దోమలు నిలిచి ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. అందువల్ల, వృద్ధిని నివారించడానికి పూల కుండలు, బకెట్లు, బర్డ్ బాత్‌లు, కూలర్లలలో ఉన్న నీటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఖాళీ చేయాలి.
  • ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ఏదైనా సంచుల్లో లేదా క‌వర్ల‌లో నింపి, బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో పారేయాలి. లేదా మున్సిపాలిటీ వాహ‌నాల్లో వేయాలి. ఇంటీ స‌మీపంలో ఉన్న మురుగు కాల్వ‌ల్లో బ్లీచింగ్ చ‌ల్లాలి.
Must Read
Related News