అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని (Armoor town) 3వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
ఐదేళ్ల క్రితం కాలనీలో బీటి రోడ్డు ఎత్తుగా నిర్మించారు. అయితే రోడ్డు కింది నుంచి భారీ కల్వర్టుల నిర్మాణం చేపట్టకపోవడంతోపై నుంచి వచ్చిన వరద నీరు ఈ రోడ్డు వద్ద నిలిచిపోయి పక్కనే ఉన్న ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం పట్టణ అభివృద్ధి కోసం రూ.18.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సారి అయిన నిధులు కేటాయించి హౌసింగ్ బోర్డులో వరద కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

