ePaper
More
    HomeజాతీయంCloudburst | ఉత్తరాఖండ్​లో వర్షబీభత్సం.. ఆకస్మిక వరదలతో పలువురి గల్లంతు

    Cloudburst | ఉత్తరాఖండ్​లో వర్షబీభత్సం.. ఆకస్మిక వరదలతో పలువురి గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloudburst | ఉత్తరాఖండ్​లో (Uttarakhand) మళ్లీ వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్​ కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. చమోలీ జిల్లాలో శుక్రవారం రాత్రి క్లౌడ్‌బరస్ట్‌ (Cloudburst) అయింది.

    ఉత్తరాఖండ్​లో ఇటీవల క్లౌడ్​ బరస్ట్​ అయి ధరాలి గ్రామం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘనటలో 60 మందికిపైగా చనిపోయారు. ఇటీవల జమ్మూ కశ్మీర్​లో (Jammu and Kashmir) సైతం మేఘ విస్పోటనం జరిగింది. తాజాగా చమోలీ జిల్లాలో (Chamoli district) క్లౌడ్​ బరస్ట్​తో కుండపోత వాన పడింది. దీంతో ఆకస్మిక వరదలు రావడంతో పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లలోకి వదర నీరు వచ్చింది. పలువురు ప్రజలు గల్లంతయ్యారు. శిథిలాల కింద కూరుకుపోయి ఓ యువతి మృతి చెందింది. సమాచారం అందుకున్న NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

    Cloudburst | కొనసాగుతున్న సహాయక చర్యలు

    మెరుపు వరదలు సంభవించడంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి మృతి చెందింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు (NDRF and SDRF teams) వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి (CM Pushkar Singh Dhami) ఈ ఘటనపై స్పందించారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. థరాలి-గ్వాల్డామ్, థరాలి-సగ్వారా రహదారి రోడ్లను అధికారులు మూసివేశారు.

    Cloudburst | రాజస్థాన్‌లో భారీ వర్షాలు

    రాజస్థాన్​లో (Rajasthan) సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట, సవాయ్‌ మాధోపూర్‌, బుండి జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. బుండిలోని నైన్వాన్‌లో 13 సెం.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. భారీవర్షాలతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రభుత్వం 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు (schools holidays) ప్రకటించింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...