Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. వరదలో చిక్కుకున్న బిహారీ కూలీలు

Nizamsagar | అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. వరదలో చిక్కుకున్న బిహారీ కూలీలు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | భారీ వర్షాల కారణంగా జుక్కల్​ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. కళ్యాణి ప్రాజెక్టులో భారీగా వరద వచ్చి చేరుతోంది.

Nizamsagar | మంజీర పరవళ్లు..

మంజీర నది (Manjeera river) పరవళ్లు తొక్కుతోంది.. ఎగువ నుంచి విపరీతంగా వస్తున్న వరదల కారణంగా నిజాంసాగర్​ ప్రాజెక్టు 16 గేట్లను వదిలి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి.

Nizamsagar | 35 ఏళ్లలో మొదటిసారి..

నిజాంసాగర్​ మండల కేంద్రంలోని చిన్నాపూర్​ వంతెనను (Chinnapur village) ఆనుకొని వదర ప్రవహిస్తోంది. గత 35 ఏళ్లలో ఇలా వంతెనను తాకుతూ వరద పారడాన్ని మొదటిసారి చేస్తున్నామని ప్రజలు పేర్కొంటున్నారు.

Nizamsagar | నిజాంసాగర్ గ్రామంలోకి వరద..

నిజాంసాగర్​, సుల్తాన్​పూర్​ (Sulthanpur) గ్రామాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. ఎగువన లింగంపేటలో చెరువులు తెగిపోవడంతో భారీ వరద ఈ రెండు గ్రామాలను చుట్టుముట్టింది. మునుపెన్నడూ లేనివిధంగా నిజాంసాగర్​ మండలంలోని బొగ్గుగుడిసె పూర్తిగా నీటమునిగింది. లింగంపేటలో చెరువులు కొట్టుకుపోగా వరద అంతా కళ్యాణి ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో ప్రజలంతా ముందస్తుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

Nizamsagar | నీటిలో చిక్కుకున్న బిహారీ కూలీలు..

బొగ్గుగుడిసె సమీపంలో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ ఉన్న 8మంది బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నాయి. అక్కడ ఉన్న వాటర్​ట్యాంకర్​ పైకి వెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే గొన్కుల్​ గ్రామంలోని కోళ్ల ఫారంలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులు వరదలో చిక్కుకున్నారు. ముగ్గురిలో ఒక బాలుడు ఉన్నట్లు సమాచారం.

Nizamsagar | రంగంలోకి దిగిన ఎస్డీఆర్​ఎఫ్​ సిబ్బంది..

బొగ్గుగుడిసె వద్ద వరదలో చిక్కుకున్న కూలీల కోసం ఎస్డీఆర్​ఎఫ్ (SDRF)​ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మొదట హెలీక్యాప్టర్​ సాయంతో కూలీలను కాపాడాలని సూచించినట్లు తెలిసింది. అయితే ముందుగా ఎస్డీఆర్​ఎఫ్​ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.

బొగ్గుగుడిసె వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న కూలీల కోసం రంగంలోకి దిగిన ఎస్డీఆర్​ఎఫ్​ సిబ్బంది

వరద నీటిలో మునిగిపోయిన కళ్యాణి ప్రాజెక్టు పరిసరాలు