అక్షరటుడే, వెబ్డెస్క్ :Weather | రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టనున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అయితే శుక్రవారం నుంచి వానలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department officers) తెలిపారు. ఈ రోజు అడపాదడప వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 30 నుంచి 45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Must Read
Related News
