అక్షరటుడే, బాన్సువాడ: Heavy Rains | ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు (farmers) కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షం నీటిలో (rain water) ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షం పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాన్సువాడ మండలంలోని (Banswada mandal) కోనాపూర్, హన్మాజిపేట్, సంగోజిపేట్, బీర్కూరు మండలంలోని తదితర గ్రామంలో మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షం ఆగకపోవడంతో ఎండలో ఎండబెట్టే అవకాశం లేక రైతులు నిరాశలో మునిగిపోయారు. ప్రభుత్వమే మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Heavy Rains | కమ్మర్‌పల్లిలో..
అక్షరటుడే, కమ్మర్పల్లి : Heavy Rains | మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి (Heavy Rains) తీవ్ర పంటనష్టం సంభవించింది. ముఖ్యంగా కోనాపూర్, కోన సముందర్, బషీరాబాద్, ఉప్లూర్, చౌట్పల్లిలలో భారీ వర్షానికి వరి పంట నేలకొరగడమే కాకుండా ఎండబెట్టిన ధాన్యం సైతం తడిసిపోయింది. రైతన్నలు కష్టపడి పండించిన పంట రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heavy Rains | ఏ మండలంలో ఎంత నష్టం..
కమ్మర్‌పల్లిలో 70 ఎకరాలు, చౌట్పల్లిలో 60 ఎకరాలు, ఉప్లూర్ క్లస్టర్లో 65 ఎకరాలు, బషీరాబాద్‌లో 50 ఎకరాలు, కోన సముందర్ క్లస్టర్లో 120 ఎకరాల పంట వర్షానికి దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ తెలిపారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 
 

