ePaper
More
    HomeతెలంగాణFarmers | తడిసిన ధాన్యం.. అన్నదాత ఆగమాగం

    Farmers | తడిసిన ధాన్యం.. అన్నదాత ఆగమాగం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Farmers | ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను farmers అకాల వర్షాలు sudden rains ఆగం చేస్తున్నాయి. పంట విక్రయించే సమయంలో వాన పడటంతో ధాన్యం తడిసి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ మందకోడిగా సాగుతుండగా.. దీనికి తోడు అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వానకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ sraddhanand ganj తో పాటు పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

    నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తాము పండించిన ధాన్యం విక్రయించడానికి జిల్లా కేంద్రంలోని గంజ్​కి తరలిస్తారు. కొనుగోలు చేసే వరకు అక్కడి షెడ్లలో sheds బస్తాలను నిల్వ చేసుకుంటారు. కొనుగోళ్లు buying ఆలస్యమైతే షెడ్లలోని బస్తాలు అలాగే ఉంటాయి. అయితే బస్తాలు ఎక్కువగా ఉంటే కొందరు బయట ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేసుకుంటారు. అకాల వర్షాలు పడితే బయట నిల్వ చేసిన వారి ధాన్యం తడిసిపోతోంది. కొనుగోళ్లు వేగంగా పూర్తి చేస్తే ఈ సమస్య ఉండదని రైతులు ఆంటున్నారు.

    Farmers | లారీల కొరత

    కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేవని, రైతులకు సరిపడా సంచులు, లారీలు ఉన్నాయంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. శ్రద్ధానంద్ గంజ్​ Shradhanand Ganjకు వచ్చే ధాన్యం సామర్థ్యానికి 40 మంది హమాలీలు hamali’s అవసరం ఉంటారు. కానీ గత నాలుగు రోజులుగా 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. అలాగే లారీలు కూడా రోజుకి రెండు మూడు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతులు గంజ్​కు వచ్చాక ధాన్యం విక్రయించడానికి దాదాపు ఆరు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది.

    వారం రోజులు అయితుంది

    – లలిత, రైతు, ముబారక్ నగర్

    లలిత, రైతు, ముబారక్ నగర్
    లలిత, రైతు, ముబారక్ నగర్

    మేము వడ్లను ఇక్కడికి తెచ్చి వారం అవుతుంది. ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. నిత్యం పొద్దున వచ్చి రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నాం. చిన్నపిల్లలను వదిలేసి వస్తున్నాం. నిన్న కురిసిన వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది.

    హమాలీలు లేరంటున్నారు

    – అర్జున్, రైతు ముబారక్ నగర్

    అర్జున్, రైతు ముబారక్ నగర్
    అర్జున్, రైతు ముబారక్ నగర్

    వడ్లను తెచ్చి వారమవుతుంది.. అధికారులను అడిగితే హమాలీలు లేరంటున్నారు. కుటుంబం మొత్తం ఇక్కడే ఉంటున్నాం. తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టెందుకు కష్టపడుతున్నాం.

    పట్టించుకునే వారే లేరు

    – రాజు, రైతు, అర్సపల్లి

    రాజు, రైతు, అర్సపల్లి
    రాజు, రైతు, అర్సపల్లి

    వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నాను. కొనుగోళ్మాలు మాత్రం చేయడం లేదు. తీరా అకాల వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది.

    వెను వెంటనే కొనుగోలు చేస్తున్నాం

    – శకుంతల, ఐకేపీ శ్రద్ధానంద్ గంజ్​ ఇన్​ఛార్జి

    శకుంతల, ఐకేపీ శ్రద్ధానంద్ గంజ్​ ఇన్​ఛార్జి
    శకుంతల, ఐకేపీ శ్రద్ధానంద్ గంజ్​ ఇన్​ఛార్జి

    రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేస్తున్నాం. మూడు రోజులుగా హమాలీలు రావడం లేదు. అందుకే ఇబ్బందులు తలెత్తాయి. లారీల కొరత కూడా కొంతవరకు ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

    Latest articles

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    More like this