అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Rains | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలో ఇటీవల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాన పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరుతోందని ప్రజలు వాపోతున్నారు. కాగా మంగళవారం రాత్రి సైతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో సైతం మంగళవారం వాన దంచికొట్టింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉంది. మోస్తరు వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎండ వచ్చిందని రైతులు ధాన్యం ఆరబోశారు. అయితే ఒక్కసారిగా వాన రావడంతో వడ్లు తడిసిపోయాయి.