- Advertisement -
Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad | హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం (Heavy Rain) పడింది. కుషాయిగూడ, నాగారం, చర్లపల్లి, రాంనగర్‌లో వాన పడింది. జవహర్‌నగర్‌, ఏఎస్‌రావు నగర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు మార్గాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​ అయింది. నగరంలో అర్ధరాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సైతం భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News