HomeతెలంగాణRainy Season | అరగంట వానకే ఆగమాగం.. జాగారం చేసిన నగర వాసులు!

Rainy Season | అరగంట వానకే ఆగమాగం.. జాగారం చేసిన నగర వాసులు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Rainy Season | అరగంట కురిసిన వానకే నగరం ఆగమాగం అయింది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నిజామాబాద్(Nizamabad)​ నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు సైతం నేలకూలేలా గాలులు వీచాయి.

గాలుల దాటికి సోమవారం రాత్రి నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. నగరవాసులు బయటకు వెళ్లాలంటేనే భయపడ్డారు. చెట్లు కూలి విద్యుత్​ తీగలపై పడటంతో నగరంలో విద్యుత్​ స్తంభాలు (Electricity poles) విరిగిపడ్డాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్​ తీగలు తెగిపడ్డాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా(Electricity supply) నిచిలిపోయింది. కరెంట్​ లేకపోవడంతో నగరవాసులు రాత్రంతా జాగారం చేశారు.

Rainy Season | వేగంగా పునరుద్ధరణ పనులు

నగరంలో అరగంట సేపే ఈదురుగాలులు వీచినా తీరని నష్టం మిగిల్చాయి. చెట్లు కూలడం, విద్యుత్​ స్తంభాలు, హోర్డింగ్​లు పడిపోయాయి. పార్క్​ చేసిన వాహనాలపై చెట్లు, విద్యుత్​ స్తంభాలు పడడంతో అవి ధ్వంసం అయ్యాయి. అయితే గాలివాన బంద్​ కాగానే విద్యుత్​ సిబ్బంది(Electricity personnel), పోలీసులు(Police) సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్లపై పడ్డ చెట్ల కొమ్మలను తొలగించడం ప్రారంభించారు. విద్యుత్​ సిబ్బంది కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తూ విద్యుత్​ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత కరెంట్​ రాగా.. కొన్ని చోట్ల ఇప్పటికీ కరెంట్​ లేదు. అధికారులు వేగంగా విద్యుత్​ లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.