Heavy Floods
Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో గంగా నది (Ganga River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీవర్షాలు, వరదలతో అనేక నగరాలు ముంపునకు గురయ్యాయి. వారణాసి, ప్రయాగ్​రాజ్ నగరాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో జనజీవనం స్తంభించిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్, ప్రయాగ్‌రాజ్, ఔరైయా, హమీర్‌పూర్, మీర్జాపూర్, ఆగ్రా, వారణాసి, కాన్పూర్ దేహత్, బల్లియా, బండా, ఇటావా, ఫతేపూర్, కాన్పూర్ నగర్, చిత్రకూట్‌లతో సహా 14 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగా, యమునా, రామగంగా తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Heavy Floods | గంగానదికి భారీ వరద

భారీ వర్షాలతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రయాగ్​రాజ్​లో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లనుంచి బయటకు రావడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద బీభత్సం నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.