ePaper
More
    HomeతెలంగాణHeavy Rain | హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఆరెంజ్​ అలెర్ట్ జారీ.. అధికారులకు సీఎం కీలక...

    Heavy Rain | హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఆరెంజ్​ అలెర్ట్ జారీ.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy Rain | హైదరాబాద్​ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడగా.. సాయంత్రం విజృంభించింది. రాత్రి తీవ్ర రూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

    ఈ రోజు (జులై 18) రాత్రి నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నగరానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Heavy Rain | భారీగా ట్రాఫిక్​ జామ్​..

    మహా నగరంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు వాన దంచి కొట్టింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్​ జామ్ అయింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండాపూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్​ అయింది. సికింద్రాబాద్‌లోని ‘పైగా’ కాలనీ వర్షానికి నీట మునిగింది. దీంతో కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అక్కడ పరిశ్రమలు, షోరూమ్​లలో పని చేస్తున్న ఉద్యోగులు చిక్కుకుపోయారు.

    READ ALSO  Supreme Court | కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

    Heavy Rain | ప్రగతినగర్​లో ఇళ్లల్లోకి నీరు..

    ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే ప్రగతినగర్​లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రగతినగర్​ చెరువు వద్ద ఉన్న అపార్ట్మెంట్​ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. డ్రెయినేజీ వాటర్​ రివర్స్ కావడంతో అపార్ట్మెంట్​ వాసుల పరిస్థితి దుర్భంగా మారింది.

    Heavy Rain | అప్రమత్తంగా ఉండాలి సీఎం

    నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. GHMC, HMDA, వాటర్‌ వర్క్స్‌ సమన్వయంతో పని చేయాలని సూచించారు. SDRF, NDRF, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

    Latest articles

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    More like this