HomeUncategorizedHeavy Rains | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 63 మంది మృతి

Heavy Rains | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 63 మంది మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rains | హిమాచల్​ ప్రదేశ్ (Himachal Pradesh)​ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల దాటికి ఇప్పటికే 63 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలువురు గల్లంతయ్యారు.

Heavy Rains | మరో మూడు రోజులు

హిమాచల్ ప్రదేశ్​లో మరో మూడు రోజులు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కురిసిన కుండపోత వానలతో రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లింది. పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారుల అంచనా. వర్షాలతో 63 మంది మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ నెల 7 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు.

Heavy Rains | ఆ జిల్లాల్లో అధికం

హిమాచల్​ ప్రదేశ్​లోని మండి, కాంగ్రా, చంబా, సిమ్లాలో వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. క్లౌడ్​ బరస్ట్​(Cloud Burst)తో ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదల దాటికి చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎంతో మంది గల్లంతయ్యారు. 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. విద్యుత్​ స్తంభాలు (Electricity poles) నేలకూలడంతో పలు గ్రామాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Must Read
Related News