ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు వర్ష సూచన

    Weather Updates | నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department officers) తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్​, నిజామాబాద్​, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని పేర్కొన్నారు. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంది. సాయంత్రం, రాత్రి పూట భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.


    మెదక్​, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్​, వరంగల్​, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad)​ నగరంలో చెదురుమదురు వానలకు అవకాశం ఉందని వివరించారు.

    Weather Updates | దంచికొట్టిన వాన

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం పడింది. మెదక్​, కామారెడ్డి(Kamareddy) జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుమార్లు వర్షం పడింది. కొంతకాలంగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో ఊరటనిచ్చాయి. భారీ వర్షం పడడంతో రైతులు(Farmers) పొలం పనుల్లో బిజీ అయ్యారు. చాలా చాలా గ్రామాల్లో వరినాట్లు ప్రారంభించారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...