అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | తెలంగాణ (Telangana)ను చలి వణికిస్తోంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి.
ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉంది. శీతాకాలం ప్రారంభం నుంచే చలి పంజా విసిరింది. అయితే నిన్నటి వరకు కొనసాగిన కోల్డ్‌వేవ్ (Cold Wave) ముగిసినట్లు అధికారులు తెలిపారు. దీంతో నేటి నుంచి చలి తీవ్రత కొంచెం తగ్గుతుందన్నారు. సాదారణ ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతాయని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో తొలి వర్షం ఈ నెల 14న పడనుందని తెలిపారు. బలహీనపడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడుతుందని, మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందన్నారు. చలి తీవ్రత తగ్గుతుందని తెలిపారు.
Weather Updates | గడ్డకట్టిన దాల్ సరస్సు
ఉత్తర భారత దేశాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీ (Delhi)లో రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నారు. అనేక చోట్ల జీరో కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు గడ్డకట్టింది. రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో చలి తీవ్రత పెరిగింది. పంజాబ్, హర్యానాలో సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.