ePaper
More
    HomeతెలంగాణRain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రంలో పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    రాష్ట్రంలో భారీ వర్షాలు లేక రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటలకు నీరు అందడం లేదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.

    READ ALSO  Heavy Rains | హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసుల ఇబ్బందులు

    Rain Alert | రాజస్థాన్‌లో కుండపోత

    రాష్ట్రంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఉత్తరాదిలో మాత్రం దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తగా.. తాజాగా రాజస్థాన్​లో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోటా సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. బుధవారం 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు హెచ్చరించారు. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు చంబల్‌ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వర్షాలతో ఇప్పటికే 16 మంది మృతి చెందారు.

    Latest articles

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    Samagra Siksha | సమగ్ర శిక్ష ఉద్యోగులను బదిలీ చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర...

    Collector Kamareddy | రామారెడ్డి వైద్యాధికారికి షోకాజ్ నోటీస్​ ఇవ్వండి..: కలెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యాధికారులు తరచుగా డుమ్మా కొడుతున్నారు....

    More like this