Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయితే శుక్రవారం వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వాన పడే ఛాన్స్​ ఉంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయితే శుక్రవారం వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వాన పడే ఛాన్స్​ ఉంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతాయి. హైదరాబాద్ (Hyderabad)​లో చెదురుమొదురు వర్షాలు కురుస్తాయి. రానున్న మూడు నాలుగు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. జులై 1 నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

కాగా రాష్ట్రంలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతులు పొలం పనులు ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa) విడుదల చేయడంతో ఎరువులు కొనుగోలు చేసిన రైతులు.. వర్షాలతో భూములను సిద్ధం చేసుకుంటున్నారు. పలువురు అన్నదాతలు వరినాట్లు ప్రారంభించారు. మరో భారీ వర్షం పడితే వరి నాట్లు మరింత జోరందుకోనున్నాయి.

Related articles

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.