అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather | రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం కూడా రాష్ట్రంలో వేడి ఎక్కువగా ఉండనుంది. పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్(Hyderabad)లో చెదురుముదురు వానలు పడే ఛాన్స్ ఉంది.
