HomeతెలంగాణWeather Updates | తెలంగాణకు నేడు వర్ష సూచన

Weather Updates | తెలంగాణకు నేడు వర్ష సూచన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వాన దంచి కొడుతుందన్నారు.

ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, కరీంనగర్​, వరంగల్​, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జులై 26 వరకు భారీ వర్షాలు(Heavy Rains) పడుతాయన్నారు. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు వెల్లడించారు. గోదావరి నదికి జులై 26 నుంచి 29 మధ్య భారీ వరద వస్తుందని అంచనా వేశారు.

Weather Updates | వాగులకు జలకళ

గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు పారుతున్నాయి. చెరువుల్లోకి కొత్త నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. దీంతో రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు.