అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు.
తెలంగాణలోని పలుచోట్ల మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. బుధవారం సైతం వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడుతాయి.
Weather Updates | హైదరాబాద్లో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నగర శివారులోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. శంషాబాద్లో 64 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడే ఛాన్స్ ఉంది.
Weather Updates | ఉక్కపోతతో ఇబ్బందులు
రాష్ట్రంలో వర్షం పడుతున్నా.. గాలిలో తేమ ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు వేడి అధికంగా ఉంటుంది. మరోవైపు పలు గ్రామాల్లో మధ్యాహ్నం పూట కరెంట్ ఉండటం లేదు. ఇటీవల భారీ వర్షాలకు కూలిపోయిన విద్యుత్ స్తంభాలను అధికారులు సరి చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంటోంది. దీంతో ప్రజలు వేడితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురిశాయి.
Weather Updates | ఆంధ్రప్రదేశ్లో..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. ఏపీలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.