ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Weather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు (Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులు పాటు వానలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులుగా వాన తెరిపినివ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

    తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్​, నిర్మల్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. రోజంతా వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కూడా చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఆగస్టు 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి.

    Weather Updates | రైతుల హర్షం

    రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో (Heavy Rains) వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. నదులకు వరద పోటెత్తింది. చెరువులు నిండుకుండలా మారి అలుగు పారాయి. ప్రాజెక్ట్​లకు సైతం భారీగా వరద రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు (Ground Water) సైతం పెరిగాయి. అన్ని ప్రాజెక్టులు (Projects) నిండడంతో వాటి కింద ఉన్న ఆయకట్టుకు రెండు పంటలకు ఢోకా లేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వానలు గ్యాప్​ ఇవ్వడంతో పొలాలకు ఎరువులు చల్లడం, పురుగు మందులు పిచికారీ చేయడం లాంటి పనులు చేస్తున్నారు.

    Latest articles

    Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Teacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్​పూర్ (kundwanpur)​ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై...

    Drone Attack | రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్​.. అణువిద్యుత్​ కేంద్రంపై డ్రోన్​లతో దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drone Attack | రష్యా–ఉక్రెయిన్​ మధ్య యుద్ధం (Russia–Ukraine War) ఆగడం లేదు. రెండు...

    Vinayaka chavithi | గణపతుల బావి పూడికతీత పనులు ప్రారంభం

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka chavithi | వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి మొదలైంది. ఇప్పటికే గణనాథులను...

    More like this