ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Weather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు(rains in Telangana) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది.

    గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండగా.. పశ్చిమ, దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​(Hyderabad)లో సాయంత్రం, రాత్రి సమయంలో తేలికపాటి వానలు పడొచ్చు. అల్పపీడనం కారణంగా సోమవారం నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉంది.

    Weather Updates | 8 రోజులు ముందుగా రుతుపవనాలు

    నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) శనివారం కేరళ(Kerala) తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్​ 1న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది 8 రోజులు ముందుగానే రావడం గమనార్హం. 16 ఏళ్ల తర్వాత ఇంత త్వరగా రుతు పవనాలు కేరళను తాకాయి. 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. తర్వాత మళ్లీ ఇప్పుడే.. రుతుపవనాలు ఇంత త్వరగా వచ్చాయి. 2022 మే 29న, 2023లో జూన్​ 8న, 2024 మే 30న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది.

    READ ALSO  Telangana University | సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియ

    Weather Updates | రైతుల హర్షం

    ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు భారీగా పడుతున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా ముందుగానే వస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్​లో పంటలకు ఢోకా లేదని అంటున్నారు. మరోవైపు వానాకాలం పంటలకు వ్యవసాయ భూములను సిద్ధం చేసుకుంటున్నారు.

    Latest articles

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay...

    More like this