అక్షరటుడే, వెబ్డెస్క్: Rain alert | రాష్ట్రంలోని పలు జిల్లాలో మరికొద్ది గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తుపానులు ప్రారంభమయ్యాయని పేర్కొంది. రానున్న మూడు గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్లో వానలు పడతాయని చెప్పింది. అక్కడక్కడ తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
