అక్షరటుడే, వెబ్‌డెస్క్:Rain Alert | రాష్ట్రం(State)లోని పలు జిల్లాల్లో సోమవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ(Telangana)లో వానలు పడొచ్చని తెలిపారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్(Hyderabad)లో కూడా చెదురు ముదురు వానలు పడొచ్చని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
