అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం (heavy rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నాగర్కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్నగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, భువనగిరి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడతాయి. హైదరాబాద్ నగరంలో (Hyderabad City) మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట మోస్తరు వర్షం పడుతుంది.
Weather Updates | రైతులతో దోబూచులాట
రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షం రైతులతో (farmers) దోబూచులాట ఆడుతోంది. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ప్రారంభించారు. అయితే వడ్లు ఆరబోయడానికి వరుణుడు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఉదయం ఎండరాగానే రైతులు వడ్లు ఆరబోస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వర్షం పడుతోంది. దీంతో ధాన్యం తడిసిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నిత్యం వానలు పడుతుండటంతో కోతలు చేపట్టడానికి సైతం రైతులు ఆలోచిస్తున్నారు. హార్వెస్టర్లు పొలాల్లో దిగబడుతున్నాయి.